




సంపాదనకు అందుబాటులో వున్న మార్గాలు | |
• వస్తువు/సేవ అమ్మకం
మీరు యిప్పటికే అమ్ముతున్న వస్తువులు, అందిస్తున్న సేవల వంటివి వున్నట్లయితే, వాటిని ఇంటర్నెట్ ద్వారా అమ్మే ప్రయత్నం చేయవచ్చు. ఇంటర్నెట్ మీరు మీ వస్తువును/సేవను ప్రస్తుతం మీరున్న ప్రదేశం నుండే ప్రపంచం మొత్తం అమ్మగలగడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా (ప్రపంచంలో ఎక్కడ వున్న వారికైనా) ఆన్‌లైన్ కోచింగ్, ట్యూషన్లు, డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు, జ్యోతిష్కులు, వాస్తు శాస్త్రఙ్ఞులు, వంటవారు వంటి అనేక మంది సలహాలు, సంప్రదింపులు సేవలు అందించడానికి అవకాశం సృష్టించబడుతుంది.ఇవన్నీ అమ్మకం ద్వారా డబ్బు సంపాదించిపెట్టే మార్గాలే.
• ప్రకటనలు
వస్తువులు/సేవలు అమ్మకం ద్వారా కాక, ఇంటర్నెట్‌లో వెబ్-సైట్/బ్లాగ్‌ల ప్రచురణ కర్తలకు ఆదాయం సమకూర్చి పెట్టే నమ్మకమైన, కాల పరీక్ష తట్టుకుని నిలబడ్డ మార్గం ప్రకటనలు. ఈ మార్గం ద్వారా ఆదాయం గడించాలంటే, మీ వెబ్-పుటలో/బ్లాగ్‌లో కొంత జాగా ప్రకటనల కోసం కేటాయించవలసి వుంటుంది.
• అనుబంధ/సంబంధ/నివేదించే వ్యక్తి/సంస్థగా వ్యవహరించడం
Referrer అంటే నివేదించేవాడు అని అర్ధం. ఒక వెబ్ సైట్ ఏదన్నా వస్తువునో/సేవనో అమ్ముతున్నట్లయితే, వారికి మీరు నివేదకుడిగా (వారికి అవసరమైతే/కావాలనుకుంటే) పని చేయవచ్చు. .ఇలా పని చేసినందుకు మీకొచ్చే ఆదాయం, మీరు (మీ వెబ్‌సైట్/బ్లాగ్ ద్వారా) నివేదించిన వినియోగ దారుడికి వారు వస్తువునో/సేవనో అమ్మడం వలన వారికొచ్చే అదాయంలో కొంత భాగం. మీరు వారి వస్తువు/సేవకు ఒక ప్రకటనను మీ వెబ్-పుట/బ్లాగ్‌లో పొందుపరుస్తారు. మీ బ్లాగ్/వెబ్-సైట్ పాఠకుడు, మీరు (బ్లాగ్/వెబ్‌పుటలో) పెట్టిన ప్రకటనలో లంకె మీద క్లిక్ చేసి, ఆ వెబ్ సైట్‌కు వెళ్ళినట్లయితే, మీరు ఆ పాఠకుడిని, ఆ వెబ్ సైట్‌కు నివేదించినట్లు.
ఆ వెబ్ సైట్‌లో వున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ నివేదనకు సంబంధించిన వివరములను గ్రహించి భద్రపరుస్తుంది. వెబ్-సైట్/బ్లాగ్ నివేదించిన వినియోగదారుడు, ఆ వెబ్-సైట్‌లో వస్తువును/సేవను కొనుగోలు చేసిన వెంటనే, మీరు నివేదన కమీషన్ చెల్లించబడటానికి అర్హులవుతారు. మీ ఖాతాలో కమిషన్ కొంత కనీస మొత్తం పేరుకోగానే మీకు చెల్లింపు జరుగుతుంది

గూగుల్ వారి యాడ్‌సెన్స్ ప్రకటనలు.
ఆ వెబ్ సైట్‌లో వున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ నివేదనకు సంబంధించిన వివరములను గ్రహించి భద్రపరుస్తుంది. వెబ్-సైట్/బ్లాగ్ నివేదించిన వినియోగదారుడు, ఆ వెబ్-సైట్‌లో వస్తువును/సేవను కొనుగోలు చేసిన వెంటనే, మీరు నివేదన కమీషన్ చెల్లించబడటానికి అర్హులవుతారు. మీ ఖాతాలో కమిషన్ కొంత కనీస మొత్తం పేరుకోగానే మీకు చెల్లింపు జరుగుతుంది
బ్లాగర్ బ్లాగ్ ద్వారా యాడ్‌సెన్స్ ఖాతాకోసం ధరఖాస్తు చెయ్యడం | |||||||||||

• ఇంగ్లీషులో చేసిన బ్లాగర్ బ్లాగ్ ద్వారా ధరఖాస్తు చెయ్యడం ఉత్తమం
వెబ్ పుటలు సృష్టించడం, వెబ్ సైట్ల గురించిన అవగాహన కలుగచేసుకోవడం యిప్పుడిప్పుడే మొదలు పెట్టిన వారికి, మీ ధరఖాస్తు ఖచ్చితంగా ఆమోదించడానికి అవసరమైన రూపంలో వెబ్ సైట్‌ను సృష్టించి, దాని ద్వారా గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమమునకు ధరఖాస్తు చేసుకోవడం కొంచం కష్టమైన పని. అందువలన బ్లాగర్ బ్లాగ్‌ను సృష్టించి దాని ద్వారా యాడ్‌సెన్స్ ఖాతా కోసం ధరఖాస్తు చెయ్యడం సరళతరమైన పని. బ్లాగ్‌లు సృష్టించడంలో మీరు బ్లాగ్ ఆకృతి నిర్మాణం మీద పెద్దగా శ్రమ పడనవసరం లేదు. మీరు బ్లాగ్ ద్వారా తేలికగా ఆమోదించడానికి అవకాశమున్న రూపంలో వెబ్ పుటలు పెద్దగా శ్రమపడనవసరం లేకుండానే సృష్టించవచ్చు.
మీరు చేయవలసిందల్లా - బ్లాగర్‌లో ఒక సరికొత్త బ్లాగ్‌ను సృష్టించండి మీరు యిప్పటికే బ్లాగ్‌లను వినియోగిస్తూ బ్లాగింగ్ గురించి నేర్చుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని బ్లాగ్‌లను సృష్టించి వుండి, అవి మీరు యాడ్‌సెన్స్ ధరఖాస్తులో నమోదు చేసిన బ్లాగ్‌ను వీక్షించే వారికి కనపడకూడదనుకున్నట్లయితే మీ వ్యక్తిగత సమాచార పుటల నుండి వాటిని అదృశ్యంగా వుండేటట్లు ఎంచుకోండి. లేదా సరికొత్త గూగుల్ ఖాతా సృష్టించుకుని దానిలో ఒక బ్లాగ్‌ను సృష్టించి, దాని ద్వారా యాడ్‌సెన్స్ కొరకు ధరఖాస్తు చెయ్యండి.
- కొన్ని మంచి పోస్ట్‌లను ప్రచురించండి (మూడు, నాలుగు పోస్ట్‌లు, నాలుగైదు రోజులలో బాగా ఎక్కువ పోస్టులు అవసరం లేదు.)
- ఆ బ్లాగ్ లోపల నుండి యాడ్‌సెన్స్ కొరకు ధరఖాస్తు చెయ్యండి
- కనీసం మరికొన్ని రోజుల వరకు పోస్ట్‌లు, రోజుకొకటి చొప్పున చేస్తూ వుండండి. (మీ ధరఖాస్తు ఆమోదించబడేవరకు).
- Open Adsense website at this link: https://www.google.com/adsense. After the Adsense page opened click “Sign up now” button.
- On the next page you must completed the Adsense registration form. There three form sections must be completed on this page, here:Website information; enter you website URL, website language (Now Adsense support 32 language)
- Contact Information; Select your account type and Enter the valid information on the form (payee name, address, phone). This data be used to received when you received your payment.
Policies; you must agree all Adsense policy. Check all option on this section.
After all data complete click “Submit Information” button - After submit the form Google will review your website and your registration. Usually it needs 1 to 5 days to get your Adsense registration approved or rejected. Google will send an email to your inbox if your Adsense approved or rejected.
• ధరఖాస్తు ఆమోదించబడినదా/లేదా ఎట్లా తెలుస్తుంది
మీరు ధరఖాస్తులో భాగంగా సమర్పించి ఈ-టపా గుర్తింపు గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము కొరకు మీ గుర్తింపు. ధరఖాస్తులో మీరు చేర్చిన ప్రవేశ పదము, మీ యాడ్‌స్‌న్స్ ఖాతాకు ప్రవేశ పదమవుతుంది. అదే ఈ-టపా గుర్తింపుతో మీకు గూగుల్ ఖాతా వున్నట్లయితే, యాడ్‌స్‌న్స్ ఖాతా, గూగుల్ ఖాతా రెండూ వేరువేరు ఖాతాలుగా పరిగణించవలసి వుంటుంది.. ఆ గుర్తింపును సంబంధిత ప్రవేశ పదము వుపయోగించి మీరు http://google.com/adsense వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. మీ ధరఖాస్తు ఆమోదించబడే వరకు, మీ ధరఖాస్తు పరిశీలనలో వుంది అనే విషయం తెలియచేసే సందేశం గల వెబ్ పుట ప్రదర్శించబడుతుంది. ఆమోదించబడ్డ తరువాత చాలా పుటలు కనబడతాయి.
ఒకవెళ మీ ధరఖాస్తు తిరస్కరించబడినట్లయితే, దానిని తిరిగి సమర్పించడానికి వుపయోగపడే పత్రం గల పుట ప్రదర్శించబడుతుంది.మీ ధరఖాస్తు ఆమోదించబడ్డా/తిరస్కరించబడ్డా వెంటనే ఆ విషయాన్ని తెలియ చేస్తూ మీ ఈ-టపా చిరునామాకు సందేశం పంపబడుతుంది
ఒకవెళ మీ ధరఖాస్తు తిరస్కరించబడినట్లయితే, దానిని తిరిగి సమర్పించడానికి వుపయోగపడే పత్రం గల పుట ప్రదర్శించబడుతుంది.మీ ధరఖాస్తు ఆమోదించబడ్డా/తిరస్కరించబడ్డా వెంటనే ఆ విషయాన్ని తెలియ చేస్తూ మీ ఈ-టపా చిరునామాకు సందేశం పంపబడుతుంది
ప్రకటనల జారీ యంత్రాంగ సంస్థ వద్ద వినియోగ ఖాతా పొందండి | |
ఇంటర్నెట్‌లో మనకు తారస పడే ప్రకటనల జారీ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థలు సాధారణంగా పలు రకాల ప్రకటన ఆదాయ మార్గాలను విధానాలను అందిస్తూ వుంటారు. కొన్ని సంస్థల వివరాలు క్రింద యివ్వబడి వున్నాయి.
యంత్రాంగ నిర్వాహణ సంస్థ | వారందించే ఆదాయ మార్గాలు |
---|---|
![]() | PPC ads, CPM ads, Referrals, Feed Ads (in beta), Search box |
Adbrite payment proof | ![]() |
Google Adsence proof | ![]() ![]() |
Bidvertise adsense payment proof | ![]() |
మీ బ్లాగ్‌లో/వెబ్ సైట్‌లో ప్రకటనలను ప్రదర్శించి వాటి నుంచి ఆదాయం గడించాలనుకున్నట్లయితే, మీరు కనీసం ఏదో ఒక ప్రకటనల జారీ/భట్వాడా యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థతో నమోదు చేసుకుని వారి వద్ద వినియోగ ఖాతా పొందవలసి వుంటుంది. [మీ అంతట మీరు ప్రకటనలు తెచ్చుకోగల సత్తా వుంటే తప్పితే]. మీరు గూగుల్ వారి యాడ్‌సెన్స్ కార్యక్రమములో వినియోగ ఖాతా పొందడం మెరుగైన/ఉత్తమమైన ఆలోచనగా భావిస్తున్నాము. గూగుల్ వారి ఈ కార్యక్రమము అన్నింటికంటే ఎక్కువ విశ్వశించదగినది మరియు మీ బ్లాగ్/వెబ్ సైట్‌లో ప్రకటనల ద్వారా ఆదాయం గడించడానికి ఉత్తమమైన అవకాశం కలుగచేస్తుంది.
యాడ్‌సెన్స్ ప్రకటనలకు రూపకల్పన | |

విధి విధానాలను అతిక్రమించకండి
గూగుల్ యాడ్‌సెన్స్ ప్రోగ్రాము విధి విధానాలు
ప్రచురణకర్తలు ఎల్లప్పుడూ గూగుల్ విధి విధానాలను పాటిస్తూ వుండాల్సిందే. మీకు ఆ విధి విధానాల గురించిన అవగాహన సంపూర్ణంగా కావాలంటే, పై పుటను సంపూర్తిగా చదవండి. విధి విధానాలను పాటించడంలో విఫలమైనట్లయితే, మీ గూగుల్ యాడ్‌సెన్స్ ఖాతా రద్దు చేయబడుతుంది. అప్పటివరకు మీ ఖాతాలో వున్న మొత్తం కూడా మీకు చెల్లించబడక పోవచ్చు.