తట్టు పలక, సంఖ్యాత్మక విలువలను ప్రదర్శించే ఒక పలక. ఇది వెబ్ సైట్‌ను ఎంతమంది సందర్శించారు అనే విలువను ప్రదర్శిస్తుంది. వెబ్ పుట విశ్లేషణను పుట తొలగింపు ద్వారా చేస్తున్నామనుకుంటే తట్టు పలకపై వున్న సంఖ్య పుటను సందర్శకులు ఎన్ని సార్లు వీక్షించారు/అందుకున్నారు అనేది తెలియచేస్తుంది. ఇది ఆ పుటలో చేర్చబడ్డ (సదృశ్య/అదృశ్య) ప్రతిమ కొరకు ప్రతిమకు ఆతిధ్యమిస్తున్న వెబ్‌సైట్‌కు వినతి ఎన్నిసార్లు పంపబడింది అనే దాని బట్టి లెక్క కట్ట గలుగుతుంది.